కడుపు నొప్పితో బాధపడుతున్నఅమితాబ్ బచ్చన్ కి శనివారం శస్త్ర చికిత్స చెయ్యనున్నారు. ఈ విషయమై ఈరోజు కొన్ని పరిక్షలు జరిపారు. సి.టి స్కాన్ ద్వార నొప్పి తీవ్రతను తెలుసుకున్నారు. ఈ విషయమయి అమితాబ్ బచ్చన్ తన ట్విట్టర్ లో ” కడుపు నొప్పికి చేసే శస్త్ర చికిత్స అంత సంక్లిష్టం కాదని సులభంగా అయిపోతుందని డాక్టర్ లు చెప్పారు రేపు ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళేంత వరకు ఇది ఎటువంటి ఆపరేషనో తెలియదు” అని చమత్కరించారు. గతం లో చాలా సార్లు తనకి కడుపు నొప్పి వచ్చింది అని చాలా దెబ్బలు తగిలాయి అని కూడా అన్నారు. బిగ్ బి తొందరగా కోలుకోవాలని కోరుకుందాం.