ప్రకాష్ రాజ్ కి ప్రశంశలు తెచ్చిపెట్టిన ధోని

ఈరోజు ఇక్కడ జరిగిన “ధోని ” చిత్ర ప్రదర్శనలో పాల్గొన్న పాత్రికేయులు మరియు ప్రకాష్ రాజ్ సన్నిహితుల స్పందన చూసి ప్రకాష్ రాజ్ ఆనందంగా ఉన్నారు. ఈ విషయాన్నీ ట్విట్టర్ లో ప్రస్తావిస్తూ ” ధోని చిత్రాని చుసిన పాత్రికేయులు మరియు నా సన్నిహితులు సానుకూల స్పందన ఇచ్చారు మీకు కూడా ఈ చిత్రం నచ్చుతుంది అని చెప్పగలను” అని చెప్పారు. ఈ చిత్రం లో పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ విషయమై పూరి జగన్నాథ్ ట్విట్టర్ లో ” ధోని చిత్రం గురించి వస్తున్న స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఆకాష్ విషయం లో గర్వంగా ఫీల్ అవుతున్నాను ధోని చిత్ర బృందానికి శుభాకాంక్షలు” అని చెప్పారు. ఈ చిత్రం లో రాధిక ఆప్టే,నాజర్, శ్రీ తేజ,బ్రహ్మానందం మొదలగునవారు నటించారు. ఈ చిత్రానికి మేస్రో ఇళయరాజా సంగీతం అందించగా కే.వి.గుహన్ ఛాయాగ్రహణం అందించారు. ఈ చిత్రం ఫిబ్రవరి 10న తెలుగు మరియు తమిళం లో విడుదల కానుంది.

Exit mobile version