దక్షణాది కథానాయికలు బాలివుడ్ లో అవకాశం కోసం చాలా వేచి చూస్తుంటారు ఎందుకంటే ఎక్కువ పారితోషకం మరియు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది అని. ఈ మధ్య అసిన్ ముంబై కి మకాం మార్చింది అక్కడ అవకాశాల కోసం వేచి చూస్తుంది. ఇలా అనుకునే తారల నుండి కాజల్ అగర్వాల్ కి మినహాయింపు ఇవ్వాలి. ఈ మధ్యనే యష్ రాజ్ ఫిల్మ్స్ లో షాహిద్ కపూర్ సరసన నటించే అవకాశమొచ్చినా ఈ భామ విజయ్ సరసన నటించే అవకాశం కోసం ఆ చిత్రాన్ని కాదన్నది చూస్తుంటే కాజల్ ది తెలివైన నిర్ణయం అనిపిస్తుంది ఇప్పుడు ఈ తార రామ్ చరణ్ సరసన వి.వి.వినాయక్ చిత్రం లో నటిస్తున్నారు. అనుష్కకి అవకాశాలు తగ్గాక మరియు జెనిలియా పెళ్లి అయిపోయాక ప్రస్తుతం తెలుగు పరిశ్రమ కి తక్కువ మంది కథానాయికలు ఉన్నారు.కాజల్,ఇలియానా,సమంత మరియు తమన్నా లు మాత్రమే ఉన్నారు. ఈ విషయాన్నీ పక్కన పెడితే అసిన్ కి బాలివుడ్ లో విజయాలు పెద్దగా దక్కలేదు. కాజల్ తెలుగు పరిశ్రమ కోసమే పని చెయ్యటం ఆమెకి చాలా అవకాశాలు తెచ్చిపెడుతుంది. ఇది చాలా తెలివైన నిర్ణయం.