బాలయ్య బాబు జీవితంలోని సంఘటనలతో ‘కల్కి’: రవి చావాలి


గతంలో జగపతి బాబుతో ‘సామాన్యుడు’ అనే సినిమా తీసిన రవి చావాలి చాలా రోజుల తర్వాత మళ్లీ డైరెక్షన్ చేయబోతున్నాడు. బాలకృష్ణ హేరోగా రమేష్ పుప్పాల నిర్మించబోయే చిత్రానికి డైరెక్షన్ చేసే ఛాన్స్ కొట్టేసారు రవి చావాలి. ఈ చిత్రం నిన్ననే పూజ కార్యక్రమాలతో ప్రారంభమైంది. రవి చావాలి ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామాగా తీర్చిదిద్దనున్నట్లు, బాలయ్య బాబు ఇమేజ్ కి తగ్గట్లుగా ఉండేలా ఈ స్క్రిప్ట్ మీద చాలా రోజులు పని చేసానని, బాలయ్య బాబు గారి సినిమాకి డైరెక్షన్ చేసే ఛాన్స్ వచ్చినందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ సినిమా ఎలా ఉండబోతుంది అని అడడగా ఇది చాలా పవర్ఫుల్ సబ్జెక్ట్. బాలయ్య జీవితంలోని సంఘటనలు ఆధారంగా ఉంటుంది. ప్రేక్షకులను బాగా ప్రభావితం చేస్తుంది. బాలయ్య బాబు ఈ సినిమాలో పవర్ఫుల్ మరియు స్టైలిష్ గా ఉండబోతున్నారు అని అన్నారు. రవి చావాలి బాలయ్య బాబుతో తెరపై ఏ మేరకు మేజిక్ చేయిస్తారో వేచిచూద్దాం.

Exit mobile version