మీ కోసం ప్రిన్సు మహేష్ బాబు గురించి ఒక బ్రహ్మాండమైన వార్త ఒకటి తీసుకు వచ్చామండి. హాలివుడ్ కండల వీరుడు బ్రాడ్ పిట్ కు పర్సనల్ ట్రెయినింగ్ ఇచ్చే జిం కోచ్ ను మహేష్ బాబు అక్షరాలా కోటి రూపాయలు ఇచ్చి ప్రత్యేకం గా హైదరాబాద్ రప్పించుకున్నాడు. అతడే గ్రెగ్ రోచే. ఇతగాడు మన మిల్క్ బాయ్ మహేష్ బాబు కు ప్రత్యేకం గా నాలుగు నెలల పాటు శిక్షణ ఇస్తాడని తెలిసింది. గ్రెగ్ ప్రత్యేకత ఏమిటంటే, శరీరాన్ని కండలు తిరిగేలా కఠొరమైన వ్యాయామాలతో మలచినప్పటికీ, ముఖములోని అందం కానీ సున్నితత్వం కానీ ఏమాత్రం తగ్గకుండా చూసుకోవటమే.
ఇంతకీ ఈ శ్రమంతా ఎందుకంటార? సుకుమార్ దర్శకత్వం లో రాబోతున్న చిత్రం లో మహేష్ బాబు షర్టు తీసేసి ఒక సన్నివేసం లో నటించాల్సి ఉందట. అయితే ఈ సీన్ తో విపరీతం గా ఇంప్రెస్ అయిన మహేష్ బాబు, కత్తి లాంటి శరీరం తో కనపడాలని దృడం గా నిశ్చయించుకున్నాడు. అందుకే కోటి రూపాయలు ఇచ్చి మరీ కష్ట పడుతున్నాడు.
సాధారణం గానే మహేష్ బాబు ని చూస్తే అటు కాలేజి భామల నుండి ఇటు వయసు అయిపోయిన బామ్మల వరకూ అందరూ ముగ్దులవుతారు. ఇక కండలు తిరిగిన శరీరం తో షర్టు లేకుండా కనపడితే వీరి పరిస్థితి ఏమిటో?