మహేష్ బాబు అత్యంత ఆకర్షణీయమయిన మగవాళ్ళలో 5వ స్థానం లో నిలిచారు . ఈ పోల్ ని టైమ్స్ అఫ్ ఇండియా నిర్వహించారు. టాప్ 50 లో నిలిచిన దక్షణాది నటులలో ఈయన ఒకరు. మిగిలిన ఇద్దరు రానా దగ్గుబాటి మరియు సిద్దార్థ్. దూకుడు మరియు బిజినెస్ మాన్ చిత్రాలతో తన ఖ్యాతి ని పెంచుకున్న మహేష్ బాబు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ పోల్ లో ఐదవ స్థానం లో నిలవడం ఆసక్తికరం ఈ పోల్ తో మహేష్ బాబు కి ఉన్న అభిమాన బలం మరోసారి నిరూపణ అయ్యింది.