ఇక పై స్కిన్ షో చేయను అంటున్న సమీర రెడ్డి


అవును మీరు విన్నది నిజమే. ఇప్పటి వరకు స్కిన్ షో చేసిన సినిమాలేవీ నాకు పేరు తీసుకు రాలేదు. ఇక పై నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు మాత్రమే చేయాలని అనుకుంటున్నాను. గతంలో నేను తమిళంలో నటించిన ‘వారనమ్ అయిరమ్’ నాకు మంచి పేరు తీసుకువచ్చింది. అలంటి పాత్రలు చేయటం కూడా చాలెంజింగ్ గా ఉంటుంది. ఇకపై అలాంటి పాత్రలే చేయాలని అనుకుంటున్నాను. అలాగని ఒకే టైపు పాత్రలు చేయాలన్న బోర్ కొడుతుంది. సినిమా సినిమాకి కొత్తదనం ఉండాలి. పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటించాలని ఎప్పటినుంచో కోరికగా ఉంది అని సమీరా రెడ్డి అంటుంది. ఆమె ఇటీవలే తమిళ్లో నటించిన ‘వెట్టై’ చిత్రం పెద్ద హిట్ అయింది.

Exit mobile version