నితిన్ – నిత్య లు నటించిన “ఇష్క్” చిత్రం ప్రస్తుతం మనాలి లో చిత్రీకరణ జరుపుకుంటుంది. నితిన్ మీద పాట చిత్రీకరిస్తున్నారు బి.విక్రం కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మల్టీ డైమన్షనల్స్ పతాకం పై నిర్మిస్తున్నారు ఈ చిత్ర ఆడియో విడుదల ఫిబ్రవరి 2 న ఉండవచ్చని తాజా సమాచారం. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఫై.సి.శ్రీరాం సినిమాటోగ్రఫీ అందించారు . ఈ చిత్రం ఫిబ్రవరి మూడవ వారం లో విడుదల అయ్యే అవకాశాలున్నాయి.