హిట్ సినిమాలకు సీక్వెల్స్ అనౌన్స్ చేసిన వై.వి.ఎస్ చౌదరి

YVS-Chowdary

డైరెక్టర్ వై.వి.ఎస్ చౌదరి ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆసక్తికరమైన న్యూస్ ని అనౌన్స్ మెంట్ చేసారు. ‘బొమ్మరిల్లు’ బ్యానర్ ఈ సంవత్సరంతో 12 సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భంగా తన చేయబోయే సినిమాలు, అలాగే తను తీసిన హిట్ సినిమాలకు సీక్వెల్స్ గురించి అనౌన్స్ చేసారు.

గతంలో వచ్చిన ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాకి సీక్వెల్ గా ‘కృష్ణా ముకుందా మురారి’ అనే మూవీని తీయనున్నారు. ఈ సినిమా కూడా అదే తరహాలోనే ఉండనుంది.

‘సూపర్ హిట్ మాస్ ఎంటర్టైనర్ అయిన ‘సీతయ్య’ సినిమాకి ‘ఎవ్వరి మాట వినడు’ అనే సీక్వెల్ చేయనున్నారు.

ఈ సినిమాలను మరో రెండు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని అన్నారు. అలాగే నటీనటులను కూడా త్వరలోనే అనౌన్స్ చేస్తున్నారు. అలాగే వై.వి.ఎస్ అలాగే మరో రెండు సినిమాలను కూడా అనౌన్స్ చేస్తున్నారు. అందులో ఒకటి ‘సి.ఎం – కామన్ మాన్’ రెండవది ‘థాంక్స్ బేబీ-నన్ను లవ్ చెయ్యనందుకు’.

Exit mobile version