‘కిష్కింధపురి’తో బెల్లంకొండ శ్రీనివాస్ సాలిడ్ కమ్ బ్యాక్..!

Kishkindhapuri

టాలీవుడ్‌లో ఇటీవల రిలీజ్ అయిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లేటెస్ట్ చిత్రం ‘కిష్కింధపురి’ సూపర్ హిట్ దిశగా దూసుకెళ్తోంది. ఈ సినిమాను దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి పూర్తి హారర్ జోనర్ చిత్రంగా రూపొందించగా, ఇందులోని హారర్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను భయపెట్టడంలో సక్సెస్ సాధించాయి. ఇక ఈ సినిమాతో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చాలా రోజుల తర్వాత ఓ పర్ఫెక్ట్ సూపర్ హిట్ కొట్టబోతున్నాడు.

‘కిష్కింధపురి’ బాక్సాఫీస్ దగ్గర సాలిడ్ వసూళ్లను రాబడుతూ దూసుకెళ్తోంది. ఈ సినిమాను రూ.32 కోట్ల బడ్జెట్‌తో మేకర్స్ తెరకెక్కించారు. అయితే, నాన్-థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమా రూ.28 కోట్లు రాబట్టింది. ఇక థియేట్రికల్ రైట్స్ రూ.8 కోట్లకు అమ్ముడయ్యాయి. ఈ చిత్రం రిలీజ్ అయిన తొలి మూడు రోజుల్లోనే బాక్సాఫీస్ దగ్గర రూ.15 కోట్ల గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఇక సోమవారం ఈ చిత్రం బ్రేక్-ఈవెన్ కావడం ఖాయం. దీంతో ఈ చిత్రాన్ని కొనుగోలు చేసిన బయ్యర్స్ మంచి లాభాలు అందుకోబోతున్నారు.

‘రాక్షసుడు’ చిత్రం తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ ఆ స్థాయిలో హిట్ అందుకోలేదు. దీంతో ఇప్పుడు ‘కిష్కింధపురి’ చిత్రంతో ఈ హీరో సాలిడ్ కమ్ బ్యాక్ ఇచ్చాడని సినీ విశ్లేషకులు, అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సాహు గారపాటి నిర్మించారు.

Exit mobile version