టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు సంబంధించిన ఒక అప్డేట్ కోసం అతని అభిమానులు ఇంతలా ఎదురు చూడడం ఇంతకు ముందు ఏ సినిమాకు లేదని చెప్పాలి. తారక్ ఆల్ టైం ఫేవరెట్ దర్శక ధీరుడు రాజమౌళితో చేస్తున్న భారీ మల్టీ స్టారింగ్ అండ్ భారీ బడ్జెట్ పీరియాడిక్ చిత్రం “రౌద్రం రణం రుధిరం”.
స్వాతంత్ర సమరయోధులు, తెలుగు నేలకు చెందిన నిప్పు రవ్వలు అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీంలుగా రామ్ చరణ్ మరియు తారక్ లు కనిపించనున్నారు. అల్లూరిగా చరణ్ తో మాస్ ట్రీట్ ను జక్కన్న ఎప్పుడో ఇచ్చేసారు. అలాగే కొమరం భీం గా తారక్ ఎలా ఉంటాడా అని అంతా ఎదురు చూస్తున్నారు కానీ అది అలా వాయిదా పడుతూ వస్తూనే ఉంది.
కానీ ఇప్పుడు అందుకు రంగం సిద్ధం అయ్యింది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ “RRR” సెట్స్ లో ఈ అక్టోబర్ రెండో వారంలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. తారక్ పై కట్ చేయనున్న టీజర్ వరకు సీన్స్ లో నటించి సాధ్యమైనంత తొందరగా తారక్ అభిమానులు ఎదురు చూస్తున్న మాస్ ఫీస్ట్ ను అందించాలని జక్కన్న ప్లాన్ చేస్తున్నారట. మరి మొత్తానికి యంగ్ టైగర్ రెడీ అవుతున్నాడు..చూడడానికి మీరు రెడీగా ఉండండి. మంచి కబురు ఎప్పుడైనా రావొచ్చు.