యంగ్ హీరో వరుణ్ సందేశ్ వరుస హిట్స్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. ఆయన నటించిన హ్యాపీ డేస్, కొత్త బంగారు లోకం సినిమాలు ఆయనకు విపరీతమైన పాపులారిటీ తెచ్చిపెట్టాయి. ఐతే ఆ తరువాత వరుణ్ సందేశ్ కొన్ని వరుస పరాజయాలు పొంది, రేసులో వెనుకబడ్డారు. దీనితో ఆయనకు అవకాశాలు బాగా తగ్గిపోయాయి.
ఇక వరుణ్ తేజ్ తన భార్య వితిక షేరు తో కలిసి గత బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొన్నారు. భార్యతో కలిసి షోని బాగా రక్తి కట్టించిన వరుణ్ చివరి వరకు పోరాడి , ఫైనలిస్ట్ లలో ఒకరిగా నిలిచారు. కాగా ఈ యంగ్ హీరో నేడు ఓ త్రో బ్యాక్ పిక్ పంచుకున్నాడు. టీనేజ్ లో ఉన్న వరుణ్ ఆ ఫొటోలో కూలీ వలే..లగేజీ మోస్తున్నాడు. యంగ్ వరుణ్ చొక్కా కూడా లేకుండా కూలీగా భలే ఉన్నాడు.
https://www.instagram.com/p/CCubpZ0DMVV/?igshid=1kjto6u0darh7