పూరి కుమారుడి సామాజిక బాధ్యత..!

పూరి కుమారుడి సామాజిక బాధ్యత..!

Published on Jul 23, 2020 8:46 PM IST

యంగ్ హీరో ఆకాష్ పూరి కరోనా వైరస్ నేపథ్యంలో తన ఫ్యాన్స్ కి ఓ విజ్ఞప్తి చేశారు. తన పుట్టిన రోజు సంధర్భంగా ఎటువంటి సన్నాహాలు నిర్వహించ వద్దని కోరుకున్నారు. అలాగే తాను కూడా పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు చెప్పారు. అధికారులు, పోలీసులు మరియు ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, సామాజిక దూరం పాటించి కరోనా సోకకుండా భద్రంగా ఉండాలని కోరుకున్నారు. తన విన్నపాన్ని మన్నిస్తారని ఆశిస్తున్నా అన్నారు.

ఆకాష్ పూరి సామాజిక బాధ్యత నెటిజెన్స్ ని ఫిదా చేసింది. ప్రస్తుతం ఆకాష్ పూరి రొమాంటిక్ అనే లవ్ ఎంటర్టైనర్ లో నటిస్తున్నారు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతుండగా, కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తుంది. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఓ కీలక రోల్ చేస్తున్నారు.

https://twitter.com/ActorAkashPuri/status/1286238208615833601

తాజా వార్తలు