ఆ యంగ్ హీరో అకీరా ఫేవరేట్ అట..!

నటి రేణు దేశాయ్ కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో తన ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్న రేణు దేశాయ్, మీడియా కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. నేడు మదర్స్ డే పురస్కరించుకొని ఆమె ఓ ఛానెల్ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు. ఒక తల్లిగా రేణు దేశాయ్ కి ఇద్దరు పిల్లలు అకీరా, ఆద్యా అభిరుచులు ఎంత వరకు తెలుసో అడిగి తెలుసుకున్నారు. కాగా ఈ కార్యక్రమంలో యాంకర్ రేణును అకీరాకు ఇష్టమైన హీరో ఎవరో చెప్పాలని అడిగారు. దానికి సమాధానంగా రేణు యంగ్ హీరో అడివి శేష్..అకీరా ఫేవరేట్ హీరో అని చెప్పింది.

ఎవరు సినిమా చూసిన తరువాత అకీరా హీరో అడివి శేష్ కి ఫ్యాన్ అయిపోయాడట. శేషు అన్న అని అకీరా అతన్ని పిలుస్తాడట. అడివి శేషు ఓ రోజు రేణు దేశాయ్ ఫ్యామిలీని కలవడం జరిగింది. టీనేజ్ కూడా దాటని అకీరా 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు ఉన్నాడు. రేణు సైతం టాలీవుడ్ లో నటిగా స్థిరపడడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేయడానికి సిద్ధం అని చెప్పడం జరిగింది.

Exit mobile version