యంగ్ హీరో నితిన్ నేడు ఓ ఇంటివాడు కాబోతున్నాడు. నేటి రాత్రి ఆయన వివాహం ప్రేయసి షాలినితో ఘనంగా జరగనుంది. ఐతే ఈ పెళ్ళికి కేవలం కుటుంబం సభ్యులు మరియు సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నారు. కాగా నితిన్ లేటెస్ట్ మూవీ రంగ్ దే నుండి నేడు సాయంత్రం ఓ సర్ప్రైజ్ వీడియో రానుంది. దాని కోసం డైరెక్టర్ వెంకీ అట్లూరి నితిన్ ని టార్చర్ పెట్టేస్తున్నాడట. డబ్బింగ్ థియేటర్ లో ఓ చిన్న డైలాగ్ చెప్పిన నితిన్, తరువాత తన అనుభవాన్ని ఇలా పంచుకున్నారు.
రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న రంగ్ దే మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కీర్తి సురేష్ మొదటిసారి రంగ్ దేమూవీలో నితిన్ కి జంటగా నటిస్తుంది. చాలా వరకు షూటింగ్ జరుపుకున్న ఈ మూవీ షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది.
https://twitter.com/dirvenky_atluri/status/1287244046188961792?s=20