ఎడిటింగ్ లో యుగానికి ఒక్క ప్రేమికుడు

ఎడిటింగ్ లో యుగానికి ఒక్క ప్రేమికుడు

Published on Feb 5, 2012 6:31 PM IST

సుధా మూవీస్ పతాకం పై ఆకాష్, శ్వేతా బసు ప్రసాద్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న మెసేజ్ ఓరియంటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘యుగానికి ఒక్క ప్రేమికుడు’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం డబ్బింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఎడిటింగ్ జరుపుకుంటుంది. ఈ చిత్ర దర్శకుడు మరియు హీరో ఆకాష్ మాట్లాడుతూ ఇదొక డిఫరెంట్ స్టొరీ. ఇందులో సుమన్ గారు ఒక కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్ రాజా అందించిన ఈ చిత్ర ఆడియోని ఈ నెలాఖరులో విడుదల చేసి మార్చి మొదటి వారంలో సినిమాని విడుదల చేయాలనుకుంటున్నట్లు తెలిపారు.
ఈ చిత్రానికి నిర్మాత ఈ. బాబు నాయుడు.

తాజా వార్తలు