యాప్ రూపంలో ఎవడు

Yevadu
తెలుగు సినిమా రంగంలో డిజిటల్ మీడియా ముఖ్యభాగం పోషించే తరుణమిది. దాదాపు ప్రతీ పెద్ద సినిమాకు ఫేస్ బుక్, ట్విటర్ లలో ప్రత్యేక పేజీలు వుంటున్నాయి. ఇప్పుడు సినీ తారలు వాటిని మిచిన ప్రచారానికి యోచిస్తున్నారు. అది ఏమిటి అనుకుంటున్నారా? మొబైల్ లో వాడే యాప్స్ పై దృష్టిపెట్టారు

రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమాకు సంబందించిన యాప్ ను త్వరలో విడుదల చెయ్యనుయిన్నారు. అందులో తాజా సమాచారం, ఫోటోలు, వీడియోలు వుంటాయి. ఈ యాప్ ను జనవరి 5న లాంచ్ చెయ్యనున్నారు. నిన్న ఇంటర్నెట్ లో విడుదలైన దగ్గరనుంచి కొత్త ట్రైలర్ కు రెస్పాన్స్ అద్భుతంగా వుందని అభిమానులు ఆనందంగా తెలుపుతున్నారు

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ మరియు అమీ జాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రధారులు. దిల్ రాజు నిర్మాత. దేవీశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్. ఈ చిత్రం జనవరి 12న మనముందుకు రానుంది.

Exit mobile version