జనవరి 1న ఎవడు కొత్త ట్రైలర్

జనవరి 1న ఎవడు కొత్త ట్రైలర్

Published on Dec 24, 2013 6:05 PM IST

Yevadu
రామ్ చరణ్ నటించిన ‘ఎవడు’ సినిమా జనవరి 12న మనముందుకు రానుంది. ఈ సినిమా నిర్మాతలు ప్రచారానికి పెద్ధపీట వేస్తున్నారు. కొన్ని రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ ను క్రిస్ మస్ కానుకగా మనకు అందిస్తారని అన్నారు. కాకపోతే దిల్ రాజు సమాచారం ప్రకారం కొత్త ట్రైలర్ ను జనవరి 1న విడుదలచేస్తారట

వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో శృతిహాసన్ మరియు అమీ జాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ అతిధి పాత్రధారులు. దిల్ రాజు నిర్మాత. జనవరి మొదటివారం నుండి ప్రమోషన్లపై దృష్టి పెడతారు

దేవీశ్రీప్రసాద్ సంగీతదర్శకుడు. శ్యామ్ కె నాయుడు సినిమాటోగ్రాఫర్

తాజా వార్తలు