రామ్ చరణ్ నటిస్తున్న ‘ఎవడు’ సినిమా ఆడియో జూన్ మొదటివారంలో విడుదలకానుంది. ముందుగా ఈ సినిమా ఆడియో మే 9న విడుదల చేద్దాం అనుకున్నా కొన్ని అనుకోని కారణాల వల్ల ఒక నెల వాయిదాపడింది. రామోజీ ఫిలింసిటీలో ఇటీవలే ఈ సినిమా ఒక పాటను పూర్తిచేసుకుంది. ఈ స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ను వంశీ పైడిపల్లి దర్శకత్వం వహిస్తున్నాడు. శృతి హాసన్, యామి జాక్సన్ హీరోయిన్స్. అల్లు అర్జున్, కాజల్ అగర్వాల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా ఈ ఏడాది చివర్లో విడుదలకానుంది.