వారం ఆలస్యంగా రానున్న రామ్ చరణ్ ఎవడు

వారం ఆలస్యంగా రానున్న రామ్ చరణ్ ఎవడు

Published on Jul 9, 2013 2:24 PM IST

yevadu-audio-review
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న ‘ఎవడు’ సినిమా రిలీజ్ డేట్ పై గత కొద్ది రోజులుగా ఉత్కంఠత నెలకొంది. ఈ రోజుటితో ఆ విషయానికి తెరదించారు. ‘ఎవడు’ సినిమాని జూలై 31 న రిలీజ్ చేయనున్నామని ఈ చిత్ర పి.ఆర్.ఓ తెలిపారు. ఈ సినిమాని ముందుగా జూలై 25 న రిలీజ్ చేయ్యాలనుకున్నారు కానీ ఇప్పుడు ఈ సినిమా ఓ వారం ఆలస్యంగా రానుంది. శృతి హాసన్, అమీ జాక్సన్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి వంశీ పైడి పల్లి డైరెక్టర్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకి దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడడం వల్ల ఆగష్టు 7న రిలీజ్ చెయ్యాలని ప్లాన్ చేస్తున్న పవన్ కళ్యాణ్ ”అత్తారింటికి దారేది” సినిమా వాయిదా పడుతుందేమో చూడాలి. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ – కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

తాజా వార్తలు