రికార్డు స్థాయిలో రిలీజ్ కు సిద్దమవుతున్న ‘ఎవడు’

రికార్డు స్థాయిలో రిలీజ్ కు సిద్దమవుతున్న ‘ఎవడు’

Published on Jul 24, 2013 1:14 PM IST

yevadu-poster(2)

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన సినిమా ‘ఎవడు’. ఈ సినిమా ఈ నెల 31న గ్రాండ్ గా విడుదలకానుంది. ఈ సినిమాని నైజాం, ఉత్తరాంద్రలలో ఎక్కువగా రికార్డు స్థాయి థియేటర్స్ లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ సినిమా విడుదలైన అతి తక్కువ సమయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘అత్తారింటికి దారేది సినిమా విడుదల కానుండడంతో నిర్మాత దిల్ రాజు సాద్యమైనంత వరకు మొదటి వారంలోనే కలెక్షన్లను వసూలు చేసుకోవాలని బావిస్తున్నారు. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో వున్నాయి. ఈ సినిమాకి ఈ నెల 26న సెన్సార్ నిర్వహించే అవకాశం ఉంది. శృతి హసన్, అమీ జాక్సన్ లు హీరోయిన్స్ గానటించిన ఈ సినిమాని వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించాడు. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు