ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో ఉన్న కథా రచయితలు వరుసగా దర్శకులుగా మారుతున్నారు. తాజాగా మరో రచయిత మెగా ఫోన్ పట్టుకొని లైట్స్ కెమెరాయాక్షన్ అంటున్నాడు. ‘గోపి గోపిక గోదావరి’, ‘సరదాగా కాసేపు’ సినిమాలకు కథను అందించిన పడాల శివ సుబ్రహ్మణ్యం ‘కట్ చేస్తే’ సినిమాతో దర్శకుడిగా మారుతున్నాడు. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తయిన ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సంజయ్, తనిష్క జంటగా నటిస్తున్న ఈ సినిమాని లీలా కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎస్ కుమార్ నిర్మిస్తున్నారు. పూర్ణ చాంద్ సంగీతం అందిస్తున్నాడు.