టాలీవుడ్‌లో నెక్స్ట్ బిగ్ రిలీజ్‌గా రానున్న చిత్రం ‘ఓజి’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ దగ్గర సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమాను దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేయగా పూర్తి యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయింది.
ఇక తాజాగా ఈ చిత్రం సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో యాక్షన్ అభిమానులకు థ్రిల్ కలిగించడం ఖాయమని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
పవన్ నుంచి ఎలాంటి సినిమా అయితే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో, ఓజి అలాంటి తరహా చిత్రమే అని చిత్ర యూనిట్ కాన్ఫిడెంట్‌గా చెబుతోంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా నటించగా, ఇమ్రాన్ హష్మి విలన్ పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.