‘మార్కో’ సీక్వెల్ కి క్రేజీ టైటిల్!

marco

ఈ మధ్య కాలంలో ఇండియన్ సినిమా దగ్గర క్రేజీ వైలెంట్ సినిమాగా సెన్సేషన్ సెట్ చేసిన చిత్రమే “మార్కో”. మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ హీరోగా దర్శకుడు హనీఫ్ అదేని తెరకెక్కించిన ఈ సినిమాకి తెలుగు, హిందీ లలో కూడా మంచి వసూళ్లు వచ్చాయి.

అయితే వీటితో పాటుగా ఈ సినిమాలో విజువల్స్ అందులోని వైలెంట్ కంటెంట్ దెబ్బకి పలు కాంట్రవర్సీలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇక దీని సీక్వెల్ కూడా ఆగే పరిస్థితికి వచ్చింది. కానీ మార్కో కి ఫైనల్ గా సీక్వెల్ ఇపుడు ఖరారు అయినట్టు తెలుస్తోంది.

మరి దీనికి మేకర్స్ “లార్డ్ మార్కో” అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. అలాగే ఈ సినిమాలో ఉన్ని కనిపించకపోవచ్చు అనే కూడా వినిపిస్తోంది. మరి దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇక ఇదిలా ఉంటే ఉన్ని ముకుందన్ పై నిన్ననే ప్రధాని నరేంద్ర మోడీపై భారీ బయోపిక్ అనౌన్స్ అయ్యిన సంగతి తెలిసిందే.

Exit mobile version