నిన్న థియేటర్లో ఇవాళ ఓటిటిలోకి వచ్చేసిన లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్!

మై బేబీ తెలుగు మూవీ ఓటిటి రిలీజ్, మై బేబీ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్, డీ ఎన్ ఏ సినిమా తెలుగు డబ్బింగ్, హాట్ స్టార్ తెలుగు మూవీస్ 2025, 2025 థ్రిల్లర్ సినిమాలు తెలుగు, తక్కువ టైంలో ఓటిటి రిలీజ్ అయిన సినిమాలు, డీ ఎన్ ఏ తమిళ్ మూవీ రివ్యూ తెలుగు

ఈ మధ్య కాలంలో థియేటర్స్ నుంచి ఓటిటి లలోకి సినిమాలు వచ్చేందుకు పెద్దగా ఎక్కువ సమయం తీసుకోవడం లేదు. అయితే మినిమమ్ ఒక్క వారం నుంచి మూడు వారాల గ్యాప్ లోనే వచ్చేసే సినిమాలు చూసాం కానీ ఇపుడు నిన్న థియేటర్స్ లో రిలీజ్ అయ్యిన సినిమా నేడు ఓటిటిలో ప్రత్యక్షం కావడం అనేది జరిగి ఉండకపోవచ్చు. అయితే ఇదే ఇపుడు జరిగింది.

తమిళ టాలెంటెడ్ నటుడు అథర్వ నటించిన డీ ఎన్ ఏ అనే సినిమా తమిళ్ లో రిలీజ్ అయ్యి మంచి హిట్ అయ్యింది. దీనినే నిన్న జూలై 18న తెలుగులో “మై బేబీ” పేరిట మేకర్స్ రిలీజ్ కి తీసుకొచ్చారు. మరి నిన్న థియేటర్స్ లో వచ్చిన ఈ సినిమా ఇపుడు ఓటిటిలో స్ట్రీమింగ్ కి అది కూడా తెలుగులో కూడా వచ్చేసింది.

ప్రముఖ స్ట్రీమింగ్ సంస్థ హాట్ స్టార్ వారు ఈ సినిమా హక్కులు సొంతం చేసుకోగా ఒరిజినల్ తమిళ్, డబ్బింగ్ భాషలు తెలుగుము కన్నడ, మళయాళ, హిందీ భాషల్లో కూడా స్ట్రీమింగ్ కి వచ్చేసింది. మరి ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ ని చూడాలి అనుకునేవారు ఓ=ఇప్పుడు ఓటిటిలోనే చూసేయొచ్చు. ఇక ఈ చిత్రానికి నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించగా తెలుగులో సురేష్ కొండేటి విడుదల చేశారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

Exit mobile version