అల్లరి నరేష్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘12A రైల్వే కాలనీ’ ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను నాని కాసరగడ్డ డైరెక్ట్ చేయగా డా.అనిల్ విశ్వనాథ్ పర్యవేక్షించారు. ఇక ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్‌కు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ దక్కింది.
తాజాగా ఈ సినిమా సెన్సార్ పనులు కూడా ముగించుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసింది. ఈ చిత్రంలోని థ్రిల్లింగ్ అంశాలు, ట్విస్టులు ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తాయని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
ఈ సినిమాలో మీనాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించాడు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమా నవంబర్ 21న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అయింది.
