శర్వానంద్, నిత్యా మీనన్ జంటగా నటిస్తున్న ‘ఏమిటో ఈ మాయ’ సినిమా జూన్ చివరివారంలో విడుధలకావడానికి సిద్ధంగావుంది. ఈ సినిమాకు చరణ్ దర్శకత్వం వహించగా స్రవంతి రవి కిషోర్ నిర్మించాడు. ఈ సినిమా చిత్రీకరణ ముగించుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులలో నిమగ్నమై వుంది. ఈ సినిమా గురించి నిర్మాత స్రవంతి రవి కిషోర్ మాట్లాడుతూ “‘ఏమిటో ఈ మాయ’ సినిమా ప్రేక్షకుల మనసుల్ని హత్తుకునే చిత్రం. శర్వానంద్, నిత్యా మీనన్ ల మధ్య కెమిస్ట్రీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఇద్ధరూ అద్బుతంగా నటించారు. ప్రధాన తారల మధ్య భావోద్వేగాలు పలికించే విషయంలో చరణ్ అద్బుతమైన దర్శకత్వ ప్రతిభ కనబరిచాడని”తెలిపారు. ఈ సినిమా హైదరాబాద్, గోవా, చెన్నై, పాండిచెర్రి, శ్రీ కాళహస్తి తదితర ప్రాంతాలలో తెరకెక్కించారు.జి.వి ప్రకాష్ సంగీతం అందించాడు. .