అల్లరి నరేష్ నటించిన లేటెస్ట్ సినిమా ‘యముడికి మొగుడు’ ఆర్ధిక సమస్యల వల్ల ఒక వారం వెనక్కి వెళ్ళింది. మొదటగా డిసెంబర్ 22న విడుదల చేయాలని భావించారు. ఆర్ధిక సమస్యలు తొలగిపోకపోవడం వల్ల ఒక వారం ఆలస్యంగా విడుదల చేయాల్సి వస్తుంది. అల్లరి నరేష్ సరసన రిచా పనాయ్ హీరొయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో యముడిగా షాయాజీ షిండే నటిస్తున్నాడు. యముడి భార్యగా రమ్యకృష్ణ నటిస్తుండగా ఈ. సత్తిబాబు సినిమాకి దర్శకుడు. గతంలో ఎన్నో సినిమాలు నిర్మించిన చంటి అడ్డాల ఈ సినిమాని నిర్మిస్తున్నాడు. డిసెంబర్ 28న మరో మూడు సినిమాలు విడుదలవుతున్నాయి. కో అంటే కోటి, జీనియస్, వేటాడు వెంటాడు సినిమాలు కూడా ఇదే రోజున విడుదల కానున్నాయి.