టాలీవుడ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అందాల భామ అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ హారర్ జోనర్ చిత్రం ‘కిష్కంధపురి’ రిలీజ్‌కు సిద్ధమైంది. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేసిన ఈ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.
ఇప్పటికే ఈ చిత్రానికి ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇక ఈ సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిని చూపుతున్నారు. ఈ సినిమాకు 10 గంటల్లో ఏకంగా 10వేలకు పైగా టికెట్ బుకింగ్స్ జరిగినట్లు మేకర్స్ తెలిపారు.
ఈ క్రేజ్ చూస్తుంటే, కిష్కింధపురి చిత్రంతో బెల్లంకొండ హీరో మరో సాలిడ్ హిట్ అందుకున్నట్లే అని అభిమానులు భావిస్తున్నారు. ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతం అందించగా షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి ప్రొడ్యూస్ చేశారు.