బాలీవుడ్లో యామి గౌతం రెండవ చిత్రానికి సంతకం చేసింది. త్వరలో “అమన్ కి ఆశ” అనే చిత్రంలో కనిపించనుంది. ఈ చిత్రంలో అలీ జాఫర్ ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ నివాస్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఈ ఏడాది మొదట్లో యామి గౌతం సుజిత్ సర్కార్ దర్శకత్వంలో వచ్చిన “విక్కి డోనార్” చిత్రంతో బాలివుడ్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ప్రస్తుతం ఆమె తెలుగులో అల్లు శిరీష్ సరసన రాధా మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న”గౌరవం” చిత్రంలో నటిస్తున్నారు. గత ఏడాది ఈ భామ రవి బాబు దర్శకత్వంలో వచ్చిన “నువ్విలా” చిత్రంలో కనిపించారు.