సెన్సార్ పూర్తి చేసుకున్న శివ కార్తికేయన్ ‘మదరాసి’

siva karthikeyan madharaasi

కోలీవుడ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ హీరోగా రుక్మిణి వసంత్ హీరోయిన్ గా దర్శకుడు ఏ ఆర్ మురుగదాస్ తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే ‘మదరాసి’. ఈ సినిమాతో మురుగదాస్ స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారని చాలా మంది నమ్ముతున్నారు. ఈ మధ్య వచ్చిన ట్రైలర్ మంచి ప్రామిసింగ్ గా ఉండేసరికి దీనిపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.

ఇక రిలీజ్ కి దగ్గరకి వస్తున్నా ఈ సినిమా సెన్సార్ పనులు ఇపుడు పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ అందించారు. సో థియేటర్స్ లో అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ సినిమాని ఎంజాయ్ చేయవచ్చు. ఇక ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందించగా శ్రీ లక్ష్మి మూవీస్ వారు నిర్మాణం వహించారు. అలాగే ఈ సెప్టెంబర్ 5న సినిమా గ్రాండ్ గా పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతుంది.

Exit mobile version