నితిన్ రాబోతున్న చిత్రం “కొరియర్ బాయ్ కళ్యాణ్” చిత్ర బృందంలో యామి గౌతం చేరింది. ప్రేమ సాయి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని ఫోటాన్ కథాస్ బ్యానర్ మీద ప్రముఖ దర్శకుడు గౌతం మీనన్ నిర్మిస్తున్నారు. కొద్ది నెలల క్రితం మొదలయిన ఈ చిత్రంలో అభినయ ప్రధాన పాత్ర పోషించనుందని పుకార్లు వచ్చాయి కాని నిర్మాతలు రిచా గంగోపాధ్యాయ్ వైపు మొగ్గు చూపారు. కాని తాజా సమాచారం ప్రకారం దర్శకుడు ప్రేమ సాయి ఒక ప్రముఖ పత్రికతో “గతంలో రెండు సార్లు యామి గౌతం ని సంప్రదించాను కాని అప్పుడు తను చేస్తున్న చిత్రాల మూలాన ఒప్పుకోలేదు” అని అన్నారు. ప్రస్తుతం ద్విభాషా చిత్రం “గౌరవం” చిత్ర చిత్రీకరణ పూర్తి కావచ్చింది దీని తరువాత యామి ఈ.నివాస్ “ఆమన్ కి ఆశ” చిత్ర చిత్రీకరణలో పాల్గొంటుంది. ప్రేమ సాయి చిత్రంలో చెయ్యడానికి డేట్స్ ఖాళీగా ఉండటంతో ఈ రొమాంటిక్ కామెడి చిత్రాన్ని చెయ్యడానికి ఒప్పుకున్నట్టు తెలుస్తుంది. తమిళంలో జై ప్రధాన పాత్రలో ఈ చిత్రం ఒకేసారి తెరకెక్కనుంది ఈ చిత్రం గురించిన మరిన్ని విశేషాలు త్వరలో వెల్లడిస్తారు.