గౌరవంలో లాయర్ గా కనిపించనున్న యామి గౌతం

Yami_Gautham
‘నువ్విలా’ సినిమాలో పక్కింటి పిల్లలా కనిపించిన యామి గౌతం త్వరలో రాధామోహన్ ద్విభాషా సినిమా ‘గౌరవం’లో లాయర్ గా కనిపించనుంది. హానర్ కిల్లింగ్స్ ను ఆధారంగా తెరకెక్కింది, అలాంటి వాటిని కొంతమంది యువకులు కలిసి ఎటువంటి మార్పు తెచ్చారన్నది కధాంశం. ఈ సినిమాలో యామి గౌతం, అల్లు శిరీష్ కి జంటగా నటించింది. “ఈ సినిమాలో నా పాత్ర నాకు చాలా నచ్చింది. ఇది నాకు మరో మంచి వేదిక. శిరీష్ ఇందులో చాలా బాగా నటించాడు. పనిలో తన తపన నాకు నచ్చింది, ఆతను చాల ప్రతిభావంతుడు. ” అని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో పేర్కొంది.

గౌరవంలోనే కాక,యామి గౌతం నితిన్ నటిస్తున్న ‘కొరియర్ బాయ్ కళ్యాణ్’లో సేల్స్ గర్ల్ పాత్రలో కనిపించనుంది.గౌరవం ఈ వేసవిలో మన ముందుకి రానుంది.డ్యూయెట్ మూవీ బ్యానర్లో గౌరవం సినిమాని ప్రకాష్ రాజ్ నిర్మిస్తున్నాడు. థమన్ ఈ మూవీకి సంగీతం అందించాడు.

Exit mobile version