“RRR” పై మరింత ఆసక్తి తెప్పించిన విజయేంద్ర ప్రసాద్.!

“RRR” పై మరింత ఆసక్తి తెప్పించిన విజయేంద్ర ప్రసాద్.!

Published on Jul 23, 2020 12:42 AM IST


ఇప్పుడు మన దేశంలోనే మోస్ట్ ప్రిస్టేజియస్ సినిమాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ డ్రామా “రౌద్రం రణం రుధిరం” అనే సినిమా కూడా ఒకటి. తెలుగు నేలకు చెందిన ఇద్దరు స్వాతంత్ర ఉద్యమ విప్లవకారులు అల్లూరి సీతారామ రాజు మరియు కొమరం భీమ్ లపై తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

నిజ జీవితంలో ఎలాంటి సంబంధమూ లేని ఈ ఇద్దరి కథను కల్పితంగా చూపించనున్నానని రాజమౌళి ఇది వరకే తెలిపిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే అసలు ఈ చిత్రంతో పాటు మరిన్ని భారీ చిత్రాలకు కథను అందించిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ఈ “RRR” స్టోరీ లైన్ పై పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ఈ సినిమా కథ చాలా సున్నితంగా ఉంటుందని అలాగే ఈ సినిమా విడుదల అయ్యే సమయంలో అనేక ప్రశ్నలు లేవనెత్తుతాయని కానీ రాజమౌళి వాటన్నిటికీ తన కథనంతో అద్భుతమైన సమాధానం ఇస్తారని ఆయన తెలిపారు. ఈ ఒక్క స్టేట్మెంట్ తో ఈ సినిమాపై ప్రతీ ఒక్కరిలో మరింత ఆసక్తి నెలకొంది. మరి రాజమౌళి ఈ భారీ మల్టీ స్టారర్ ప్రాజెక్ట్ ను ఎలా హ్యాండిల్ చేసారో తెలియాలి అంటే ఇంకొన్నాళ్ళు ఆగక తప్పదు.

తాజా వార్తలు