కనీస ఊసు లేకుండా తమిళ్, కన్నడలో రిలీజ్ అవుతున్న ‘ఓజి’

OG-Pawan-Kalyan-1

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ అవైటెడ్ సినిమా ఓజి ఇంకొన్ని గంటల్లో థియేటర్స్ లో బ్లాస్టింగ్ రిలీజ్ కి సిద్ధం అవుతుంది. చాలా కాలం తర్వాత పవన్ కళ్యాణ్ రేంజ్ కి సరిపడా సినిమా పడితే ఎలా ఉంటుందో మళ్ళీ ఆ రేంజ్ లో ఓజి మేనియా చూపిస్తుండగా ఈ సినిమాని మేకర్స్ మొదట్లో పాన్ ఇండియా లెవెల్లోనే అనౌన్స్ చేశారు.

తర్వాత తెలుగు కాకుండా హిందీ, తమిళ్ భాషల్లో కన్ఫర్మ్ చేశారు. కానీ తర్వాత నెమ్మదిగా పరిస్థితులు మారడంతో కనీసం పోస్టర్ లో కూడా ఈ భాషలను పొందుపరచడం ఆపేసారు. ఓజి ట్రైలర్ వచ్చే వరకు కూడా హిందీలో రిలీజ్ ఉందో లేదో అనేది కూడా చాలా మందికి క్లారిటీ లేదు. ఇక రేపు రిలీజ్ అంటే తమిళ్, కన్నడ భాషల్లో ఓజి బుకింగ్స్ ఇపుడు కనిపిస్తున్నాయి.

ఇంట్రెస్టింగ్ గా ఈ రెండు భాషల్లో కూడా విడుదల అవుతుంది అని చాలా మందికి తెలియదు. ఇంకో ఇంట్రెస్టింగ్ అంశం ఏంటంటే ఈ రెండు భాషల్లో కూడా ట్రైలర్ రిలీజ్ కాకుండానే బుకింగ్స్ ఓపెన్ లో ఉన్నాయి. ఈ రేంజ్ ప్లానింగ్ ని ఓజి చిత్రానికి మేకర్స్ మిస్ చేయడం గమనార్హం.

Exit mobile version