ఈ సినిమాలతో బాలీవుడ్ థియేటర్ తలుపులు తెరుస్తున్నాయి.!

ఈ సినిమాలతో బాలీవుడ్ థియేటర్ తలుపులు తెరుస్తున్నాయి.!

Published on Oct 14, 2020 11:05 AM IST

ఈ ఏడాది అనుకోని విధంగా కరోనా దెబ్బ వలన విధించిన లాక్ డౌన్ తో అన్ని రంగాలతో పాటుగా సినీ రంగానికి కూడా తీరని నష్టం జరిగిన సంగతి తెలిసిందే. ముఖ్యముగా థియేటర్స్ వారికి అయితే భారీ స్థాయిలో నష్టం వాటిల్లింది. దీనితో దేశ వ్యాప్తంగా మళ్ళీ థియేటర్స్ తెరుచుకోడానికి ఇవ్వాలని అంతా ప్రభుత్వాన్ని కోరగా ఈ అక్టోబర్ 15 నుంచి తెరుచుకోవచ్చని పలు నిబంధనలతో ఇచ్చారు.

ఇప్పుడు బాలీవుడ్ లో పలు కీలక చిత్రాలతో అక్కడ థియేటర్ తలుపులు తెరుచుకోడానికి రెడీ అయ్యాయి. ఈ వారంలో బాలీవుడ్ బిగ్గీ అజయ్ దేవ్ గన్ నటించిన “తనాజీ”, “శుభ మంగళ్ జ్యాదా సావధాన్”, తాప్సి నటించిన “తాప్పడ్” అలాగే సుశాంత్ సింగ్ రాజ్ పుత్ నటించిన “కేదార్ నాథ్” అలాగే “మలాంగ్” చిత్రాలతో ఈ థియేటర్స్ ఓపెన్ అవ్వనున్నాయి. మరి ఈ గ్యాప్ అనంతరం అనుభవం ప్రేక్షకులకు ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు