స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కించిన క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం “అల వైకుంఠపురములో”. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల కాబడిన ఈ చిత్రం తెలుగు ఇండస్ట్రీలోని భారీ హిట్ గా నిలిచింది. భారీ వసూళ్లతో ఎన్నో రికార్డులను నెలకొల్పిన ఈ చిత్రం ఇప్పుడు స్మాల్ స్క్రీన్ పై ఎలాంటి రికార్డులు నమోదు చేస్తుందా అని మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. ఈరోజు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జెమినీ ఛానెల్లో టెలికాస్ట్ అవుతుంది.
దీనితో బుల్లితెర మీద కూడా ఆల్ టైం రికార్డులు ఈ చిత్రం నెలకొల్పుతుందని మేకర్స్ మరియు అభిమానులు ఆశిస్తున్నారు. ఇంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మరో భారీ బ్లాక్ బస్టర్ “సరిలేరు నీకెవ్వరు” 23.4 టీఆర్పీ రేటింగ్ పాయింట్స్ తో ఆల్ టైం రికార్డును నెలకొల్పింది. ఇప్పుడు ఈ రికార్డును అల వైకుంఠపురములో క్రాస్ చేసి సరికొత్త రికార్డు నెలకొల్పుతుందా లేదా అని ప్రశ్నగా మారింది. మరి బంటు ఎంత వరకు రాబడతాడో తెలియాలి అంటే కొన్ని రోజులు వెయిట్ చెయ్యాల్సిందే.