నిన్న దేశ వ్యాప్తంగా ఓ బిగ్ న్యూస్ చక్కర్లు కొట్టింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ మహాభారతం సినిమా ప్రయత్నాలు మొదలుపెట్టారని. అలాగే ఈ భారీ ప్రాజెక్ట్ స్క్రిప్ట్ కోసం ఆయన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ ని సంప్రదించారని వార్తలు వచ్చాయి. ఇక మూవీ విషయంలో ఇప్పటికే వీరిద్దరి మధ్య చర్చలు కూడా జరిగాయన్నది ఆ వార్తల సారాంశం.
ఐతే మహాభారతం దర్శకుడు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ గా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాకు స్క్రిప్ట్ అందించాల్సిన బాధ్యత కూడా తండ్రి విజయేంద్ర ప్రసాద్ దే. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఆయన కొంత మేర స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ విజయేంద్ర ప్రసాద్ మహాభారతం స్క్రిప్ట్ అమీర్ ఖాన్ కి ఇస్తే రాజమౌళి సంగతి ఏమిటీ అనేది అసలు ప్రశ్న. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, ప్రస్తుత ఆర్ ఆర్ ఆర్ సినిమాలకు స్క్రిప్ట్ అందించిన విజయేంద్ర ప్రసాద్ మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.