ఈ సినిమా అయినా వరుణ్ సందేశ్ కి బ్రేక్ ఇస్తుందా ?

ఈ సినిమా అయినా వరుణ్ సందేశ్ కి బ్రేక్ ఇస్తుందా ?

Published on Jul 30, 2013 1:22 PM IST

Varun-Sandesh

గత కొద్ది కాలంగా హీరో వరుణ్ సందేశ్ హీరోగా నటించిన సినిమాలు ఆశించినంత విజయాన్ని సాదించడంలేదు. తన సినిమాలన్ని బాక్స్ ఆఫీసు వద్ద ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. కానీ తను మాత్రం బాక్స్ ఆఫీసు వద్ద విజయాన్ని సాదించాలని ప్రయత్నం చేస్తూనే వున్నాడు. వరుణ్ సందేశ్ నటించిన ‘అబ్బాయి క్లాస్ … అమ్మాయి మాస్’ సినిమాతో మరోసారి బాక్స్ ఆఫీసు వద్ద తన అదృష్టాన్ని పరీక్షించుకొనున్నాడు. హరిప్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి కోనేటి శ్రీను దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని మాస్ ఎంటర్టైనర్ గా తెరకెక్కించారని సమాచారం. ఈ సినిమాలో తను గ్లామరస్ పాత్రలో కనిపించనున్నట్లు హరిప్రియ తెలియజేసింది.
వరుస పరాజయాలు పొందుతున్న వరుణ్ కి ఈ సినిమా అయినా విజయాన్ని సాదిస్తుందా? అది తెలియాలంటే కొద్దిరోజులు వేచి చూడాల్సిందే.
శేఖర్ చంద్ర సంగీతాన్ని అందించిన ఈ సినిమాని లక్ష్మణ్ సినీ విజిన్ బ్యానర్ నిర్మించింది. అలీ, శ్రీనివాస్ రెడ్డి, శ్రీలక్ష్మీ తదితర కామెడీ నటులు నటించిన ఈ సినిమా ఈ శుక్రవారం విడుదలకానుంది.

తాజా వార్తలు