పరిస్థితి ఇలానే ఉంటే పవన్ సినిమా కూడా కష్టమే..!

పరిస్థితి ఇలానే ఉంటే పవన్ సినిమా కూడా కష్టమే..!

Published on Mar 14, 2020 2:56 PM IST

కరోనా వైరస్ కారణంగా అన్ని పెద్ద సినిమాల విడుదల వాయిదా పడుతూ వస్తుంది. నేడు నాని హీరోగా తెరకెక్కిన ‘వి’ మూవీ వాయిదాపడింది. ఉగాది కానుకగా ఈనెల 25న రావాల్సిన ఈ చిత్ర విడుదల వాయిదావేస్తున్నట్లు నేడు నిర్మాతలు ప్రకటించారు. అలాగే జూన్ లేదా జులై లో రావాల్సిన కెజిఎఫ్ కూడా ఏకంగా అక్టోబర్ కి వాయిదా వేయడం జరిగింది. ఈ పరిస్థితులలో పవన్ సినిమా కూడా వాయిదాపడే అవకాశం కలదు.

పవన్ కమ్ బ్యాక్ మూవీ వకీల్ సాబ్ మే నెలలో వేసవి కానుకగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రంలోని మగువా మగువా.. అనే లిరికల్ సాంగ్ విడుదల చేయడం జరిగింది. కొరోనా వైరస్ కేసులు దేశంలో అంతకంతకు పెరుగుతూ పోతున్న తరుణంలో ప్రేక్షకులు థియేటర్స్ వైపు చూసే పరిస్థితి లేదు. పరిస్థితులు మెరుగు పడకపోతే వకీల్ సాబ్ విడుదల కూడా ఆగిపోయే పరిస్థితి కలదు. ఏమైనా మే లో వకీల్ సాబ్ విడుదల కష్టమే అన్న మాట వినిపిస్తుంది.

తాజా వార్తలు