త్రివిక్రమ్ మిత్రుడు కోసం ఎలాంటి పాత్ర రాస్తారో..?

త్రివిక్రమ్ మిత్రుడు కోసం ఎలాంటి పాత్ర రాస్తారో..?

Published on May 6, 2020 3:00 AM IST

టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా ఉన్న సునీల్ అందాల రాముడు సినిమాతో హీరోగా టర్న్ అయ్యాడు. ఆ సినిమా హిట్ కొట్టడంతో రాజమౌళి దర్శకత్వంలో మర్యాద రామన్న చేశారు. ఆ మూవీ కూడా హీరోగా మంచి హిట్ అందుకున్నారు. ఆ సినిమా తరువాత కూడా అనేక కామెడీ రోల్స్ చేసిన సునీల్ తరువాత పూర్తిగా హీరోగా టర్న్ అయ్యాడు. కొన్ని సినిమాలు హిట్ అయినా తరువాత వరుసగా పరాజయాలు ఎదురయ్యాయి.

దీనితో మళ్ళీ కమెడియన్ గా మారాడు. ఈ నేపథ్యంలో ఎప్పటి నుండో సునీల్ మిత్రుడు అయిన త్రివిక్రమ్ ఎన్టీఆర్ మూవీలో సునీల్ కోసం ఎలాంటి కామెడీ రోల్ రాశాడో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆయన గత చిత్రం అల వైకుంఠపురంలో సునీల్ కి ఆయన ఓ రోల్ ఇచ్చారు. మరి ఎన్టీఆర్ సినిమాలో ఆయనకు ఎలాంటి రోల్ రాస్తాడో చూడాలి. సునీల్ కమెడియన్ గా మళ్ళీ ఫార్మ్ లోకి రావాలంటే ఆయనకి మంచి రోల్స్ రావాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు