నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి హీరోగా నటించి తెరకెక్కించిన అవైటెడ్ చిత్రమే కాంతార చాప్టర్ 1. మంచి హైప్ నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా అంచనాలు అందుకుంది, అందర్నీ మెస్మరైజ్ చేసింది. మరి బ్లాక్ బస్టర్ హిట్టయిన ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లో చేరుతుందా ? లేదా ? అని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. ప్రస్తుతం కాంతార చాప్టర్ 1 వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా 818 కోట్లు దాటాయి. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల్లో ఈ సినిమా దక్షిణాది భాషల్లో ఓటీటీలోకి అందుబాటులో వస్తుందని టాక్ నడుస్తోంది.
మరి ఒకవేళ, ఓటీటీలోకి ఈ సినిమా వస్తే.. థియేటర్స్ లో కలెక్షన్స్ ను రాబట్టడం కష్టమే. అప్పుడు ఈ సినిమా వెయ్యి కోట్ల వసూళ్లు అందుకోవడం కష్టమే. అన్నట్టు ఈ సినిమా తాలూకా హక్కులు అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. మరి లేటెస్ట్ గా ప్రైమ్ వీడియో టీజ్ పోస్ట్ చూసి అతి త్వరలోనే అఫీషియల్ డేట్ తాలూకా క్లారిటీ రానుంది. అన్నట్టు మరో 5 రోజుల్లో ఈ సినిమా ఇంగ్లీష్ వెర్షన్ ను విడుదల చేయనున్నారు.


