నటుడు సోనూ సూద్ గురించి దేశంలో తెలియని వారంటూ బహుశా ఎవరూ ఉండరేమో. కరోనా కష్టకాలంలో ఆయన వలన కూలీల పట్ల చూపించిన ఉదారత ఆయన్ను దేశవ్యాప్తంగా ఫేమస్ చేసింది. అలాగే సోషల్ మీడియా ద్వారా ఎవరు ఎలాంటి సమస్య పంచుకున్నా, ఆయన వెంటనే స్పందిస్తున్నారు. తాజాగా ఆంధ్రప్రదేశ్ లో ఓ పేద రైతుకు ఆయన ట్రాక్టర్ సాయం చేయడం విశేషంగా మారింది. సోనూ సూద్ మంచి మనసుకు సర్వత్రా ప్రసంశలు అందడంతో పాటు ఆయన ఇమేజ్ భారీగా పెరిగింది.
దీనితో ఆయన రాజకీయ అరంగేట్రం పై ఆసక్తికర చర్చ కొనసాగుతుంది. ఆయన సేవా గుణం చూసిన ప్రజలు రాజకీయాలలోకి రావాలని కోరుకుంటున్నారు. అలాగే దేశంలోని ప్రధాన రాజకీయ పార్టీలు సోనూ సూద్ ని తమ పార్టీలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. సోనూ సూద్ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చి, ఎన్నికలలో నిలబడితే విజయం ఖాయం అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఈ విషయంపై సోనూ సూద్ నిర్ణయం ఏమిటో తెలియాల్సివుంది.