ప్రస్తుతం కొరటాల శివతో ఆచార్య మూవీ చేస్తున్న చిరంజీవి నెక్స్ట్ మలయాళ హిట్ లూసిఫర్ తెలుగు రిమేక్ లో నటించనున్నారు. ఇప్పటికే ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ చివరి దశకు చేరుకుందని సమాచారం. ఈ చిత్రాన్ని సాహో ఫేమ్ సుజీత్ తెరకెక్కించనున్నాడు. ఈ మూవీలో నటీనటుల గురించి అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. అప్పట్లో ఓ కీలక రోల్ సల్మాన్ చేయనున్నాడని ప్రచారం జరిగింది. తాజాగా విలన్ పాత్ర కోసం ఓ క్రేజీ నటుడి పేరు తెరపైకి వచ్చింది. టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి, ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నాడట.
ఇప్పటికే బాలీవుడ్ లో పలు సినిమాల్లో విలన్ పాత్రల్లో నటించి మంచి పేరు దక్కించుకున్న సంజయ్, ప్రస్తుతం కెజిఎఫ్ 2లో అధీర అనే విలన్ పాత్రలో నటిస్తున్నారు. కాగా ఒరిజినల్ వెర్షన్ అయిన లూసిఫర్ లో వివేక్ ఓబెరాయ్ విలన్ గా నటించాడు, అయితే తెలుగులో అదే పాత్రకు సంజయ్ దత్ సరిపోతాడని భావించి యూనిట్ అతడిని ఎంపిక చేసినట్లు చెప్తున్నారు. దీనిపై ఎటువంటి అధికారిక ప్రకటన లేకున్నప్పటికీ గట్టిగా వినిపిస్తుంది.