వర్మ సర్ ప్రైస్ హిట్ ఇస్తారంటారా?

వర్మ సర్ ప్రైస్ హిట్ ఇస్తారంటారా?

Published on Nov 26, 2012 5:17 PM IST

అతన్ని ఇష్టపడినా, ఇష్టపడకపోయినా డైరెక్టర్ గా మాత్రం అతన్ని ఎవరూ తక్కువ అంచనా వేయలేరు అతనే డేర్ అండ్ డాషింగ్ మూవీ మేకర్ రామ్ గోపాల్ వర్మ. తను తీసిన ‘డిపార్ట్ మెంట్’ సినిమాతో కమర్షియల్ గా మరియు విమర్శకుల ప్రశంశలు అందుకోలేక పోయిన వర్మ మరోసారి తన డైరెక్షన్లో వస్తున్న ‘ది అటాక్స్ అఫ్ 26/11’ సినిమాతో మరోసారి లైంలైట్ లోకి వచ్చాడు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా మొదటి 7 నిమిషాల వీడియో గురించే మాట్లాడుకుంటున్నారు.

ఈ మూవీ ప్రివ్యూకి ఫుల్ పాజిటివ్ టాక్ వస్తోంది, కొందరైతే వర్మ కమ్ బ్యాక్ మూవీ అంటున్నారు. అందరూ అంటున్న మాట ఏమిటంటే ‘ రాము అదిరిపోయే టీజర్స్ ని వదిలారు మరియు తన పాత హిట్ సినిమాల్లాగే ఉంటుందని’ అంటున్నారు.

ఈ సినిమా ప్రివ్యూతో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటుంది అనడంలో ఏ మాత్రం అనుమానంలేదు. ప్రస్తుతం వినిపిస్తున్న అంచనాలను ఈ సినిమా అందుకుంటుందో లేదో చూడాలి. మరి మీరేమంటారు? వర్మ అందరినీ ఆశ్చర్యపరిచేలా హిట్ కొడతారంటారా? మీ సమాధానాల్ని కింద కామెంట్స్ రూపంలో తెలపండి.

తాజా వార్తలు