‘బాష 2’ సినిమాకి రజినీకాంత్ అంగీకరిస్తారా?

basha_rajnikanth

ఇప్పటి వరకు వచ్చిన ఐకానిక్ సినిమాలో ‘బాష’ సినిమా ఒకటి. ఈ సినిమాకు ఒక్క తమిళనాడులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, అలాగే భారతదేశం అంతట మంచి కలెక్షన్ లు వచ్చాయి. సురేష్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించాడు. ఈ సినిమా స్టొరీ లైన్స్ ని, స్క్రీన్ ప్లేని ఇప్పటికి కమర్షియల్ సినిమాలో ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా సీక్వెల్ ని నిర్మించాలని డైరెక్టర్ సురేష్ కృష్ణ బావిస్తున్నారు. ఈ సినిమా స్క్రిప్ట్ పై ఆయన గత కొంతకాలంగా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఆయన ఈ సినిమా విషయంపై రజినీకాంత్ తో కూడా చర్చించడం జరిగింది.
కానీ ఈ సినిమా సీక్వెల్ పై రజినీకాంత్ కి అయిష్టంగా ఉన్నారని తెలిసింది. ఈ సినిమా విజయం సాదిస్తున్న అన్న అనుమానం ఆయనలో ఉందని సమాచారం. కానీ ఈ సినిమా మంచి విజయాన్ని సాదిస్తుందని సురేష్ కృష్ణ చాలా కాన్ఫిడెంట్ గా వున్నాడు. అలాగే ఈ సినిమాకి రజినీకాంత్ ఒప్పుకుంటడని ఆయన బావిస్తున్నాడు.
‘బాష 2’ ని నిర్మించడం సమంజసమేనా? ఈ సినిమాకి రజినీకాంత్ అంగీకరిస్తారా? అనేది తెలియాలంటే కొద్ది రోజు వెయిట్ చేయాల్సిందే. అలాగే దీనిపై మీ అభిప్రాయాన్ని తెలియజేయాలనుకుంటే క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Exit mobile version