మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజునాడు రాజమౌళి సర్‌ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆర్ ఆర్ ఆర్‌లో సీతారామరాజుకు సంబంధించిన, బీమ్ ఫర్ రామరాజు వీడియో రిలీజ్ చేసి మెగా అభిమానులు జక్కన్న మంచి ట్రీట్ ఇచ్చాడు. ఆ వీడియో చరణ్‌ను ఓ రేంజ్‌లో చూపించడంతో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయ్యారు. అంతే కాకుండా ఆ వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో, ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకున్నారు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ పుట్టిన రోజుకి రాజమౌళి ఎన్టీఆర్ ఫాన్స్‌కి మరో స్పెషల్ వీడియోని రెడీ చేసాడని టాక్. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఖాళీ సమయం దొరకడంతో, ఎన్టీఆర్ స్పెషల్ టీజర్‌ని ఓ రేంజ్ లో అదిరిపోయేలా కట్ చేసాడని.. ఎడిటింగ్ వర్క్, డబ్బింగ్ వర్క్ ని ఇప్పటికే పూర్తి చేసాడట.
ఇప్పటివరకు ఎన్టీఆర్ పై చిత్రీకరించిన సన్నివేశాల్లో ద బెస్ట్ సన్నివేశాలను ఎడిటర్ తమ్మిరాజు తన ఇంటి వద్దే ఎడిటింగ్ షూట్ లోనే ఎడిట్ చేసాడని, అవుట్ ఫుట్ విషయంలో రాజమౌళి టీం చాలా సంతృప్తిగా ఉన్నారని అంటున్నారు. ఎన్టీఆర్‌కు సంబంధించిన వీడియోలో తెలంగాణ యాసలో తారక్ పలికే డైలాగ్స్ చాలా కొత్తగా ఉంటాయనే టాక్ వినపడుతోంది. మరి ఎన్టీఆర్ బర్త్‌డే కానుకగా, ఆయన ఫాన్స్‌ని రాజమౌళి ఎలా మెస్మరైజ్ చేస్తాడో చూడాలి.