ఎన్టీఆర్ ‘డ్రాగన్’ లీక్ ఆరోజున ఉంటుందా?

JrNTR-Neel

ప్రస్తుతం మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో చేస్తున్న భారీ చిత్రం డ్రాగన్ కోసం అందరికీ తెలిసిందే. భారీ హైప్ ఉన్న ఈ సాలిడ్ కాంబినేషన్ లో హీరోయిన్ గా బ్యూటీ రుక్మిణి వసంత్ నటిస్తుంది. అయితే ఇదే రుక్మిణీ వసంత్ ని ఎన్టీఆర్ కలిపి ఓకే స్టేజి మీద చూడనున్న సంగతి అందరికీ తెలిసిందే.

ఈ సెప్టెంబర్ 28న రిషబ్ శెట్టి కాంతార 1 గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తారక్ హాజరు కానున్నాడు. ఇక ఈ సినిమాలో కూడా హీరోయిన్ రుక్మిణి అని తెలిసిందే.. అయితే ఎన్టీఆర్ కూడా అక్కడ ఉండడంతో ఖచ్చితంగా ఫ్యాన్స్ నుంచి డ్రాగన్ పై టీజ్ చేయడం జరుగుతుంది. ఇలా ఇద్దరిలో ఎవరొకరి దగ్గర నుంచి చిన్న లీక్ అయినా వస్తుందేమో చూడాలి. ఇక ఈ చిత్రానికి రవి బసృర్ సంగీతం అందిస్తున్నారు. ఇక కాంతార విషయానికి వస్తే ఈ సినిమా ఈ అక్టోబర్ 2న గ్రాండ్ గా రిలీజ్ కాబోతోంది.

Exit mobile version