పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నుంచి వచ్చిన లేటెస్ట్ బాక్సాఫీస్ సెన్సేషన్ చిత్రం “ఓజి”. భారీ హైప్ నడుమ రిలీజ్ కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ ఓపెనింగ్స్ సాధించి దుమ్ము లేపింది. ఇక యూఎస్ మార్కెట్ లో కూడా ఓజి దుమ్ము లేపగా ఈ సినిమా కోసం చూస్తున్న అభిమానులు రికార్డు నంబర్స్ అందించారు.
ఇక యూఎస్ మార్కెట్ లో లేటెస్ట్ గా ఓజి చిత్రం 3.8 మిలియన్ డాలర్స్ మార్క్ ని దాటేసి నెక్స్ట్ స్టాప్ గా నాలుగు మిలియన్ క్లబ్ లో చేరేందుకు దూసుకెళ్తుంది. అయితే ఈ సినిమా తోనే పవన్ 3 మిలియన్ క్లబ్ లో జాయిన్ కాగా ఇపుడు 4 మిలియన్ క్లబ్ లో కూడా జాయిన్ కాబోతున్నారని చెప్పాలి. ఇక ఈ చిత్రంలో పవన్ సరసన ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటించగా థమన్ సంగీతం అందించాడు. అలాగే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.