లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలతో మంచి హిట్ అందుకున్న మీనాక్షి చౌదరి టాలీవుడ్‌లో వరుస అవకాశాలు అందుకుంటోంది. ఇప్పుడు ఆమె బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుంది.
జాన్ అబ్రహం హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఫోర్స్ 3’లో మీనాక్షి హీరోయిన్‌గా సెలెక్ట్ అయింది. భావ్ ధూలియా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి గత కొంతకాలంగా ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. లుక్ టెస్ట్ తర్వాత మీనాక్షి ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. ఇక ఈ చిత్ర షూటింగ్ మొదలయ్యే ముందు ఆమెకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
‘ఫోర్స్ 3’ నవంబర్‌లో సెట్స్‌పైకి వెళ్లి, వచ్చే ఏడాది విడుదల కానుంది. ఇదిలా ఉండగా, మీనాక్షి ప్రస్తుతం నవీన్ పొలిశెట్టి హీరోగా నటిస్తున్న ‘అనగనగా ఒక రాజు’ చిత్రంలో బిజీగా ఉంది. ఈ సినిమా 2026 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ కానుంది.